బ్యాండేజీతోనే బౌలింగ్ చేస్తున్న షమీ.. ఎందుకోసమో..!

-

టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ(Shami).. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బ్యాండేజీతోనే బౌలింగ్ వేస్తూ కనిపించాడు. న్యూజిలాండ్‌తో భారత్ తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసిన తర్వాత నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తూ షమీ మెరిశాడు. మెకాలి వాపు కారణంగా ఆటకు దూరమైన షమి.. ఇప్పుడు బౌలింగ్ చేస్తూ కనిపించడంతో రికవర్ అయ్యాడా? అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అతడి యాక్షన్‌లో కానీ, రన్నింగ్‌లో కానీ ఏమాత్రం లోటు కనిపించలేదు. పూర్తిస్థాయి ఫిట్‌నెస్ ఉన్న బౌలర్ మాదిరిగానే షమీ.. బౌలింగ్ చేస్తూ కనిపించాడు. అదే సమయంలో ఎన్‌సీఏలో తన ఫిట్‌నెస్‌పై షమీ స్పెషల్ ఫోకస్ పెట్టాడని బీసీసీఐ వర్గాలు చెప్తున్నాయి. తొలుత తక్కువ రన్నప్‌తో బౌలింగ్ వేయడం స్టార్ట్ చేసిన షమీ.. నెమ్మదిగా వేగం పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఎన్‌సీఏ బౌలింగ్ కోచ్ ట్రాయ్ కూలే సమక్షంలో షమీ తన బౌలింగ్ ప్రాక్టీస్‌ను కొనసాగిస్తున్నాడు.

- Advertisement -

గతేడాది మోకాలికి సర్జరీ చేయించుకోవడంతో ఎనిమిది నెలలుగా షమీ.. ఆటకు దూరంగా ఉంటున్నాడు. న్యూజిలాండ్ జరుగుతున్న టెస్ట్ సిరీస్‌కు షమీ అందుబాటులోకి వస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అది జరగలేదు. ఆ లోపు దేశవాళీ క్రికెట్‌లో తన సత్తా చాటాలనుకున్న షమీకి అక్కడ కూడా భారీ ఝలక్ తగిలింది. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా మోకాలి నొప్పిరావడంతో వైద్యులను సంప్రదించాడు. సర్జరీ జరిగిన చోటే వాపు వచ్చిందని వైద్యులు చెప్పారు. దీంతో అతడు ఆస్ట్రేలియా సిరీస్‌కు కూడా కష్టమేనని అన్నారు. కానీ ఇప్పుడు షమీ(Shami) మళ్ళీ ఫామ్‌లోకి వచ్చినట్లే కనిపిస్తోంది. దీంతో ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌కు ఎలాగైనా మైదానంలో అడుగు పెట్టాలని షమీ చూస్తున్నట్లు క్రికెట్ వర్గాలు చెప్తున్నాయి. మరి అది సాధ్యమవుతుందో లేదో చూడాలి.

Read Also: క్వార్టర్స్‌లోకి సింధు ఎంట్రీ.. చైనాను చిత్తు చేసి మరీ..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...