జమ్మూకశ్మీర్‌కు చెందిన 17 ఏళ్ల పారా ఆర్చర్ శీతల్(Sheetal Devi).. ప్యారిస్ పారాలింపిక్స్‌లో తన తొలి అడుగు ఘనంగా మోపారు. మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ర్యాంకింగ్ రౌండ్‌లో అందరి చేత ఔరా అనిపించారు.720 పాయింట్లకు గాను 703 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. నేరుగా ప్రీక్వార్టర్స్‌లో తలపడే అవకాశం సొంతం చేసుకున్నారు. కాలితో విల్లును ఎక్కు పెట్టి.. భుజంతో నారిని సంధించి శీతల్ వేసే బాణాలు గురితప్పడం చాలా తక్కువ అని మరోసారి నిరూపించారు. ఈ గేమ్స్‌లో తుర్కియేకు చెందిన ఒజ్నుర్ గిర్డి.. 704 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచారు. ఈ రౌండ్లో తొలి నాలుగు స్థానాల్లో ఉన్న ప్లేయర్లు నేరుగా ప్రీక్వార్టర్స్‌లో తలపడే అవకాశం సాధించారు.
ఈ రౌండ్‌లో శీతల్(Sheetal Devi).. 59సార్లు 10 పాయింట్లు రాబట్టగా 24 సార్లు ఎక్స్(లోపలి వృత్తానికి దగ్గరగా) గురి పెట్టారు. శనివారం జరిగే ప్రీక్వార్టర్స్‌లో శీతల్.. చిలీకి చెందిన జునిగా లేదా కొరియాకు చెందిన చోయ్ నా మితో తలపడనున్నారు. అయితే ఆసియా పారా గేమ్స్‌లో శీతల్ స్వర్ణం సాధించి ప్రధాని మోదీ ప్రశంసలు కూడా అందుకున్నారు. తాను భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలన్నదే తన కల అని కూడా శీతల్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే భారత్‌కు చెందిన మరో పారా ఆర్చర్ సరిత.. 682 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచారు.