ఇండియా క్రికెట్ హిస్టరీలో ది బెస్ట్ వన్డే మ్యాచ్ ఓపెనర్లుగా పేరు తెచ్చుకున్న వారిలే శిఖర్ ధావన్(Shikhar Dhawan) ఒకడు. అతడి ఆటకు మెచ్చి అభిమానులు ముద్దుగా అతడి గబ్బర్ అని పిలుచుకుంటారు. తాజాగా అతడు తన అభిమానులకు షాకింగ్ విషయం చెప్పాడు. తాను అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినట్లు అనౌన్స్ చేశాడు. అతడి రిటైర్మెంట్ చాలా మందిని బాధించింది. టీమిండియాకు నీలాంటి ఓపెనర్ మళ్ళీ దొరకడంటూ అభిమానులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా బీసీసీఐ(BCCI) రాజకీయాల ఫలితమేనని, స్వార్థంగా ఆలోచించిన బీసీసీఐ అయినవారికే అవకాశాలు ఇస్తే టాలెంట్ ఉన్న వారిని తొక్కేస్తున్నందకు ఫలితంగా నేడు ఒక గొప్ప ఆటగాడిని దూరం చేసుకుంటుందంటూ మరికొందరు గబ్బర్ రిటైర్మెంట్‌కు బీసీసీఐని బ్లేమ్ చేస్తున్నారు.
‘‘నా క్రికెట్ ప్రయాణంలో ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నా. వెలకట్టలేని జ్ఞాపకాలు, కృతజ్ఞత నాలో ఇమిడి ఉన్నాయి. నాకు ప్రేమ, మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. జైహింద్’’ అంటూ శిఖర్ దావన్(Shikhar Dhawan) తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. శిఖర్ ధావన్ తన కెరీర్‌లో 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2022 డిసెంబర్ 10న బంగ్లాదేశ్‌తో తన చివరి వన్డే ఆడాడు. ఆ తర్వాత అతడికి టీమిండియాలో చోటు దక్కలేదు. వన్డే ఫార్మాట్లో శిఖర్ 44.11 యావరేజ్‌తో 6,793 పరుగులు చేశాడు. అందులో 17 సెంచరీలు, 39 అర్థసెంచరీలు ఉన్నాయి. 2010లో విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేతో ధావన్ అంతర్జాతీయ కెరీర్ ప్రారంభమైంది.