Sania Mirza | సానియాతో విడాకులు.. ఇన్‌ స్టా బయో మార్చిన షోయబ్!

-

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా(Sania Mirza), పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌(Shoaib Malik) విడాకుల వార్తలు గత కొద్ది రోజులుగా షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. మాలిక్‌తో బ్రేక‌ప్ చెప్పేందుకు సానియా రెడీ అయిందని టాక్‌ వినిపించింది. ఈ స్టార్‌ కపుల్‌ విడాకులకు దరఖాస్తు చేసుకున్నారని, ప్రస్తుతం విడివిడిగా ఉంటున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై స్పందించిన షోయబ్‌ అది మా వ్యక్తిగతమని, ఆ విషయాన్ని వదిలేయాలంటూ కామెంట్‌ చేశాడు. దీంతో అప్పట్లో ఈ రూమర్స్‌కు కాస్త బ్రేక్ పడింది. కానీ తాజాగా వీరి విడాకుల వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది.

- Advertisement -

సానియా, షోయబ్‌ విడాకులు తీసుకుంటున్నారన్న అంశం నెట్టింట వైరలవుతోంది. షోయబ్‌ తన ఇన్‌స్టా బయోలో కీలక మార్పు చేయడమే ఇందుకు కారణం. బయోలో సూపర్‌ ఉమెన్‌ ‘సానియామీర్జాకు భర్త’ అన్న వాక్యాన్ని తొలగించి ‘ఓ బిడ్డకు తండ్రి’ అన్న పదాన్ని మాత్రమే ఉంచడంతో మళ్లీ విడాకుల వదంతులు వైరలవుతున్నాయి. సానియామీర్జా, షోయబ్ 2010లో పెళ్లి చేసుకున్నారు. 2018లో ఇజాన్ జన్మించాడు. కొన్నాళ్లు వీరి వివాహ బంధం సాఫీగానే సాగింది. ఆ తరువాత పలుమార్లు విడాకులు తీసుకుంటున్నారంటూ వార్తలొచ్చాయి. ఓ పాకిస్థాన్‌ మోడల్‌ కారణంగా వారి మధ్య విభేదాలు తలెత్తాయంటూ గాసిప్స్ వచ్చాయి.

ముస్లింలు ఎంతో ఘనంగా జరుపుకునే రంజాన్ పండుగ వేళ ఇద్దరూ వేరువేరు చోట్ల ఉండటం. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సానియా ఫేర్ వెల్ మ్యాచ్‌కు కూడా మాలిక్ హాజరుకాకపోవడం కూడా వీరి విడాకుల రూమర్స్‌కు బలం చేకూరింది. ఈ వార్తలపై షోయబ్‌ స్పందిస్తూ తాము కలిసే ఉన్నామని..ఇలాంటి రూమర్లను తాము పట్టించుకోబోమని క్లారిటీ ఇచ్చాడు. సానియాతో కలిసి గడిపేందుకు సమయం దొరకట్లేదని.. ఈద్‌ వేళ మేమిద్దరం కలిసి ఉంటే ఎంతో గొప్పగా ఉండేదన్నాడు.

అయితే కొన్ని ప్రొఫెషనల్‌ కమిట్‌మెంట్స్‌ కారణంగా సానియా రాలేకపోయిందని తెలిపాడు. ఇద్దరిలో ఎవరికి సమయం దొరికినా ఇరు దేశాలకు వచ్చి వెళ్తుంటామని.. మేం ఎప్పుడూ ప్రేమను పంచుకుంటూ ఉంటామన్నాడు. ఆమెను నేను చాలా మిస్‌ అవుతున్నా అని విడాకుల పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టాడు. అయితే తాజాగా షోయబ్ ఇన్‌స్టా బయోకు చేసిన మార్పులతో మరోసారి విడాకుల వదంతులు జోరందుకున్నాయి. మరి ఈ వార్తలపై సానియా(Sania Mirza), షోయబ్‌ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.

Read Also: అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబుకు కేటీఆర్ ధన్యవాదాలు 
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హర్మన్ ప్రీత్‌కు టీమిండియా పగ్గాలు..

న్యూజిలాండ్‌(New Zealand)తో వన్డే సిరీస్‌కు భారత మహిళల జట్టు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే...

‘ప్రాణాలు కావాలంటే డబ్బివ్వు’.. సల్మాన్ ఖాన్‌కు మళ్ళీ బెదిరింపులు..

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌(Salman Khan)కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఇప్పటికే...