Shoaib Malik | పాక్‌ నటిని పెళ్లి చేసుకున్న షోయబ్ మాలిక్.. సానియాతో కటీఫ్..!

-

అందరూ అనుకున్నట్లే జరిగింది. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్(Shoaib Malik), భారత టెన్నిస్ క్రీడాకారిణీ సానియామీర్జా(Sania Mirza) విడిపోయారు. వీరిద్దరు విడాకులు తీసుకున్నట్లు కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం నిజమైంది. తాజాగా పాక్ నటి సనా జావెద్‌(Sana Javed )ను పెళ్లి చేసుకున్నట్లు మాలిక్ అధికారికంగా ప్రకటించాడు. తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో వీరి పెళ్లి ఫొటోలను షేర్ చేశారు. పాక్‌లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న సనా జావెద్.. సింగర్ ఉమైర్ జస్వాల్‌ను 2020లో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఇద్దరు విడిపోవడంతో మాలిక్‌ను నిఖా చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

ఇటీవల సానియా మీర్జా కూడా పరోక్షంగా తాము విడిపోతున్నామనే విధంగా ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేశారు. ‘విడాకులు బాధాకరం’ అని అందుకు క్యాప్షన్ ఇచ్చారు. కాగా సానియా, షోయబ్(Shoaib Malik) దంపతులకు 2018 అక్టోబర్ నెలలో ఇజాన్ అనే కొడుకు జన్మించాడు. అయితే విడాకులపై అటు మాలిక్‌ , ఇటు సానియా ఎప్పుడూ అధికారికంగా స్పందించలేదు. అయితే ఇటీవల కొడుకు పుట్టినరోజు సందర్భంగా మాలిక్‌-సానియాలు కలుసుకున్నారు. కుమారుడితో విడివిడిగా ఫొటోలు దిగి సోషల్‌ మీడియాలో పోస్ట్‌చేశారు. అప్పుడే వీరిద్దరు విడిపోయినట్లు అందరికీ అర్థమైంది. ఇప్పుడు మాలిక్ మరో పెళ్లి చేసుకోవడంతో క్లారిటీ వచ్చేసింది.

Read Also : రాములోరి ప్రాణప్రతిష్ట కార్యక్రమం వెండితెరపై లైవ్‌లో చూసే అవకాశం
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హైదారాబాద్ లో మహిళా పోలీసుల కోసం వినూత్న నిర్ణయం

మహిళా పోలీసుల కోసం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు....

ముగ్గురు భారతీయుల్ని ఆరెస్ట్ చేసిన కెనడా పోలీస్

ఖలిస్తాన్ సపరేటిస్ట్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Nijjar) హత్యకేసులో ముగ్గురు...