రోహిత్, కోహ్లీకి షాక్..అగ్రస్థానం దిశగా మిస్టర్ ఇండియా 360

0
134

ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇదే ఫామ్ ను టీ20 ప్రపంచకప్ లోను కొనసాగించాలని మేనేజ్మెంట్ కోరుకుంటుంది. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ లో సూర్యకుమార్ దుమ్ములేపాడు. ఇక చివరి మ్యాచ్ ఓ తన విశ్వరూపాన్ని చూపించాడు. తన ఆట తీరుతో ర్యాంకింగ్ లోను అగ్రస్థానం దిశగా అడుగులు వేస్తున్నాడు.

మొత్తం 801 పాయింట్లతో రెండో స్థానంలో సూర్యకుమార్ ఉన్నాడు. 861 పాయింట్లతో మొదటి స్థానంలో పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ కొనసాగుతున్నాడు. ఇక మూడో స్థానంలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ వున్నారు. ర్యాంకింగ్ లో సూర్యకుమార్ తరువాతే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉండడం గమనార్హం.

హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 613 పాయింట్లతో 13వ స్థానంలో ఉన్నాడు. ఇక ఇటీవల ఫామ్ లోకి వచ్చిన కింగ్ కోహ్లీ 606 పాయింట్లతో 15వ స్థానంలో ఉన్నాడు. మరోవైపు ఆల్ రౌండర్ విభాగంలో టీమిండియా నుండి ఒక్క ప్లేయర్ కే చోటు దక్కింది. 184 పాయింట్లతో ఐదో స్థానంలో హార్దిక పాండ్యా ఉన్నాడు.