కోహ్లీ జట్టులో ఉండాలా? వద్దా?..మాజీ కెప్టెన్‌ సంచలన వ్యాఖ్యలు

0
108

ప్రస్తుతం క్రికెట్ అభిమానుల నోళ్లలో నానుతున్న పేరు విరాట్ కోహ్లీ. ప్రస్తుతం కోహ్లీ ఫామ్ పై అభిమానులే కాదు టీం మేనేజ్ మెంట్ కు సందేహాలు తలెత్తాయి. రానున్న ప్రపంచకప్ లో కీలకంగా మారుతాడనుకున్న కింగ్ కోహ్లీకి ఇప్పుడు జట్టులో స్థానమే ప్రశ్నార్ధకం అయింది. ఇక తాజాగా విరాట్‌ కోహ్లీ జట్టులో ఉండాలా లేదో అనే విషయంపై  పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ రషీద్‌ లతీఫ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లతీఫ్‌ భారత్‌లో కోహ్లీని తొలగించే సెలెక్టర్ ఇంకా పుట్టలేదని వ్యాఖ్యానించారు.