Shubman Gill | జింబాబ్వే పర్యటనలో భారత జట్టు హరారే వేదికగా నాలుగో టీ20కి సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలన్న కసితో టీమిండియా ఉంది. ఈ పర్యటనను టీమిండియా ఓటమితో ప్రారంభించిన ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడి 2-1 ఆధిక్యంతో దూసుకెళ్తోంది. అదే జోరుతో నాలుగో మ్యాచ్‌లోనూ జింబాబ్వేను చిత్తు చేయాలని శుభ్‌మన్ సేన ప్లాన్ చేస్తోంది. మరోవైపు సొంతగడ్డపై ఓడిపోకూడదని, కనీసం సిరీస్‌ను డ్రా అయినా చేసుకోవాలని జింబాబ్వే కష్టపడుతోంది.
అయితే ఈ మ్చాచ్ ఆడే టీమిండియాలో అవేశ్ ఖాన్(Avesh Khan) లేడు. అతడి స్థానంలో తుషార్ పాండే(Thushar Pandey) అరంగేట్రం చేయనున్నాడు. అవేశ్ ఖాన్‌ను పక్కన పెట్టడంతో శుభ్‌మన్ గిల్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాను ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నది తాజాగా గిల్ వివరించాడు. ‘‘పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తుంది. అందుకే తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాం. దాని వల్ల ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టడం సులభం అవుతుంది. అంతేకాకుండా డెత్ ఓవర్ల బౌలింగ్ మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఆలోచించే అవేశ్ స్థానంలోకి తుషార్‌ను తీసుకొచ్చాం. గత మ్యాచ్‌లో డెత్ ఓవర్లలో నిరాశపరిచాం. ఆ మైనస్ అధిగమించాలనే ఈ ప్రయోగం చేస్తున్నాం. దాని ఫలితంగానే అవేశ్ స్థానంలోకి తుషార్ వచ్చాడు’’ అని గిల్(Shubman Gill) వివరించాడు.