సింగపూర్‌ ఓపెన్‌ 2022..ఫైనల్స్‌కు దూసుకెళ్లిన సింధు

0
110

సింగపూర్‌ ఓపెన్‌ 2022 మహిళల సింగిల్స్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు సత్తా చాటింది. శనివారం (జులై 16) జరిగిన సెమీఫైనల్లో జపాన్‌ క్రీడాకారిణి, వరల్డ్‌ 38వ ర్యాంకర్‌ సయినా కవకామిపై 21-15, 21-7తేడాతో వరుస సెట్లలో విజయం సాధించి ఫైనల్ కు అర్హత సాధించింది. తొలి సెట్‌ నుంచే ప్రత్యర్ధిపై పూర్తి ఆధిపత్యం చలాయించిన సింధు..కేవలం 32 నిమిషాల్లోనే గేమ్‌ను ముగించింది.