Carmi le Roux | అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్(MLC)లో ఆందోళనకర సంఘటన జరిగింది. దక్షిణాఫ్రికాకు చెందిన పేసర్ కార్మి రౌక్స్ మైదానంలోనే కుప్పకూలిపోవడంతో అభిమానులంతా ఆందోళన చెందారు. బ్యాటర్ కొట్టిన బంతి నేరుగా వచ్చి కార్మి తలకు తగిలింది. తల నుంచి నెత్తురు ధారలై కారుతుండగా కార్మి అక్కడిక్కడే కుప్పకూలాడు. దీంతో కార్మికి ఏమందో అర్థంకాక ప్రేక్షకులంతా కంగారు పడ్డారు. కొద్దిసేపటికి కార్మి తిరిగి స్పృహలోకి వచ్చి.. తనంతట తానే నడుచుకుంటూ డగౌట్‌కు వెళ్లిపోయాడు. దీంతో ప్రేక్షకులతో పాటు తోటి ప్లేయర్లు అంతా ఊపిరి పీల్చుకున్నారు.
శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, సీటెల్ ఆర్కాస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కార్మి మంచి ప్రదర్శన కనబరిచాడు. అతడు మూడో ఓవర్ ఏస్తున్నాడు. అందులో కార్మి వేసిన బంతిని బ్యాటర్ షాట్ ఆడాడు. ఆ బంతి నేరుగా వచ్చి కార్మి(Carmi le Roux) ముఖాన్ని చాలా బలంగా తాకింది. దాంతో కళ్లు బైర్లు కమ్మిన కార్మి..బాధతో విలవిలలాడుతూ అక్కడే కుధేలయ్యాడు. వెంటనే స్పందించిన వైద్య సిబ్బంది పరుగున వచ్చి ప్రాథమిక చికిత్స అందించారు. దాంతో బాధ నుంచి స్పృహలోకి వచ్చిన కార్మి డగౌట్‌కు చేరుకున్నాడు. ఈ ఘటన రెండు రోజుల క్రితం జరిగినా ఈ వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Read Also: RCBలోనూ రిజర్వేషన్లు కావాలి.. కర్ణాటక ప్రభుత్వానికి వింత విన్నపం
Follow us on: Google News, Twitter, ShareChat