ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. ‘టైమ్‌డ్‌ ఔట్‌’గా వెనుదిరిగిన లంక క్రికెటర్

-

ప్రపంచ క్రికెట్ చరిత్రలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. శ్రీలంక ఆలౌరౌండర్‌ ఏంజెలో మాథ్యూస్‌(Angelo Mathews) ఒక్క బంతిని కూడా ఆడకుండానే ‘టైమ్‌డ్‌ ఔట్‌(timed out)’గా వెనుదిరిగాడు. సోమవారం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌ 25వ ఓవర్‌లో లంక ఆటగాడు సమరవిక్రమ ఔట్‌ అయ్యాడు. దీంతో మాథ్యూస్‌ బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే గ్రౌండ్‌లోకి వచ్చిన సమయంలో హెల్మెట్‌ స్ట్రాప్‌ విరిగిపోయింది. దీంతో అతడు కొత్త హెల్మెట్‌ కోసం డ్రెస్సింగ్‌ రూం వైపు సిగ్నల్‌ ఇచ్చాడు. ఈ క్రమంలో మాథ్యూస్‌ క్రీజులోకి రావడం ఆలస్యమైంది.

- Advertisement -

ఈ క్రమంలో బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్ షకీబ్ అల్‌ హసన్‌ ‘టైమ్‌డ్‌ ఔట్‌’ కోసం అప్పీల్‌ చేయగా.. ఆ అప్పీల్‌ను పరిశీలించిన అంపైర్‌ మాథ్యూస్‌(Angelo Mathews)ను ఔట్‌గా ప్రకటించాడు. ఈ నేపథ్యంలో క్రీజులోకి రాకుండానే ఔటై పెవిలియన్‌కు చేరాల్సి వచ్చింది. ‘టైమ్‌డ్‌ ఔట్‌’తో ఓ క్రికెటర్ వెనుదిరగడం ప్రపంచకప్‌లోనే కాదు అంతర్జాతీయ క్రికెట్‌లోనే తొలిసారి కావడం గమనార్హం.

‘టైమ్‌డ్‌ ఔట్‌’ అంటే ఏమిటి..?

క్రీజులో ఆడుతున్న బ్యాటర్‌ ఔట్‌ అయితే తర్వాత బ్యాటింగ్‌కు వచ్చే బ్యాటర్‌ నిర్ణీత సమయంలోగా బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. అంతర్జాతీయ క్రికెట్‌లో 3 నిమిషాలగా ఆ సమయం ఉండగా.. 2023 వన్డే ప్రపంచకప్‌ నిబంధనల్లో మాత్రం 120 సెకన్లుగా ఉంది. దీంతో 2 నిమిషాల లోపు బ్యాటర్‌ క్రీజులోకి రాకపోతే ‘టైమ్‌డ్‌ ఔట్‌(Timed Out)’గా ప్రకటిస్తారు.

Read Also: ఎంతో బాధపడుతున్నా.. మార్ఫింగ్ వీడియోపై స్పందించిన రష్మిక..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

DGP Anjani Kumar | తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ కి ఈసీ బిగ్ షాక్

తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్(DGP Anjani Kumar) పై సెంట్రల్ ఈసీ...

KCR | ఓటమి ఒప్పుకున్న కేటీఆర్.. ఫార్మ్ హౌస్ కి వెళ్లిపోయిన కేసీఆర్

KCR Resigns |తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం ఎదుర్కొంది. ఓటమిపై...