ఐపీఎల్ 2023 నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్(Sun Risers Hyderabad) నిష్క్రమించింది. ప్లేఆఫ్‌కు చేరాంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో ఓడిపోయింది. ఉత్కంఠ బరితంగా జరిగిన మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. 183 పరుగుల టార్గెట్‌ను లక్నో సూపర్ జెయింట్స్ 19.2 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ముందుగా.. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్(Sun Risers Hyderabad) 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (7), రాహుల్ త్రిపాఠీ (20), కెప్టెన్ మార్కరమ్ (28), అన్ మోల్ ప్రీత్ సింగ్ (36)లు రాణించారు. చివర్లో హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్‌లో కలిసి మెరుపు ఇన్నింగ్స్‌తో ఆడారు. క్లాసెన్ కేవలం 26 బంతుల్లో 3 సిక్సులు, 3 ఫోర్లతో 47 పరుగులు చేశాడు. ఇతనికి సమద్ 25 బంతుల్లో 4 సిక్సులు, ఒక ఫోర్‌తో 37 పరుగులు చేసి సహకరించాడు. దీంతో మొత్తంగా హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో కృణాల్ పాండ్యా 2, ఆవేశ్ ఖాన్, యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, యుధ్ వీర్ సింగ్ ఒక్కో వికెట్ పడటగొట్టారు. అనంతరం 183 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన లక్నో 7 వికెట్ల తేడాతో గెలుపొంది. ప్లేఆఫ్‌కు చేరింది.
Read Also: ఫేక్ యాడ్స్ పై పోలీసులకు సచిన్ ఫిర్యాదు
Follow us on: Google News, Koo, Twitter