హైదరాబాద్ వేదికగా జరిగిన ఇంటర్ కాంటినెంటల్ 2024 టోర్నీ(Intercontinental Cup 2024) టైటిల్ సిరియా సొంతమైంది. భారత్, సిరిమా మధ్య జరిగిన హోరాహోరీ పోరులో భారత్‌ను పరాజయం పలకరించింది. గచ్చిబైలి స్టేడియంలో మూడు దేశాల మధ్య రౌండ్ రాబిన్ లీడ్ తరహాలో ఈ టోర్నీ జరిగింది. ఈ టోర్నీ ఫైనల్‌లో భారత్, సిరియా తలపడ్డాయి. కానీ ఆరంభం నుంచి సిరియా తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. మ్యాచ్ పూర్తయ్యే సరికి సిరియా 3-0 తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. భారత్, సిరియా, మారిషస్ మధ్య జరిగిన ఈ టోర్నీలో సిరియా.. భారత్‌పై 3 పాయింట్లు, మారిషస్‌పై 2 పాయింట్లతో గెలిచి అత్యధిక స్కోర్‌తో అగ్రస్థానంలో నిలిచి టైటిల్‌ను తన సొంతం చేసుకుంది.
Intercontinental Cup 2024 | ఈ టోర్నీ ఫైనల్‌లో అన్ని విభాగాల్లోనూ డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ విఫలమైంది. మ్యాచ్ స్టార్ అయిన ఏడో నిమిషంలోనే ఒక పాయింట్‌ను సిరియా చేతిలో పెట్టింది. ఆ తర్వాత పలు అవకాశాలు వచ్చినా వాటిని కూడా సద్వినియోగం చేసుకోలేక పోయింది భారత జట్టు. ఘోట్స్ కోసం నువ్వానేనా అన్నట్లు రెండు జట్లు తలపడ్డాయి. కానీ బంతిని సిరియా ఆధీనంలోనే ఉండటం భారత డిఫెన్స్‌కు అగ్నిపరీక్షలా మారింది. ఫస్టాఫ్ ముగిసేసరికి 1-0తో సిరియా ఆధిక్యంలో ఉంది. రెండో సగం మ్యాచ్‌లో భారత్ కూడా కాస్తంత పుంజుకుని గట్టి పోటీ ఇచ్చింది. కానీ 76వ నిమిషంలో మరో గోల్ చేసింది సిరియా. ఎక్స్‌ట్రా టైమ్‌లో ముచ్చటగా మూడో గోల్ చేసి విజయం సాధించింది.