టీ20 ప్రపంచకప్..టీమిండియా కొత్త జెర్సీ చూశారా?

0
98

వచ్చే అక్టోబర్ లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ పైనే అందరి దృష్టి నెలకొంది. ప్రధానంగా ఆస్ట్రేలియా, ఇండియా జట్లు హాట్ ఫెవరెట్ గా బరిలోకి దిగబోతున్నాయి. ఇక అంతకు ముందే ఇండియా ఆస్ట్రేలియాతో 3 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనుంది.

అలాగే దక్షిణాఫ్రికాతోను మ్యాచ్ లు ఆడనుంది. ఈ క్రమంలో ఆయా జట్లు ప్రపంచ కప్ కు ఎంపిక ఈ మ్యాచ్ లపై ఆధారపడి ఉంది. ఇందులో రాణించిన వాళ్లే ప్లేయింగ్ లెవెన్ లో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక తాజాగా టీమిండియా ఆటగాళ్లు కొత్త జెర్సీలో కనువిందు చేయనున్నారు.

ఈ జెర్సీలను నేడు లాంచ్ చేయగా నెట్టింట వైరల్ గా మారాయి. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య, మహిళా క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్ కొత్త జెర్సీలో కనిపించారు. జెర్సీ నీలం రంగులో ఉంది. అలాగే మూడు నక్షత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.