T20 world cup :నేడే పాక్‌-భారత్ క్రికెట్‌‌ మహా సంగ్రామం

-

T20 world cup:క్రికెట్‌ పోటీలందు.. పాక్‌- భారత్‌ మ్యాచ్‌ వేరయా అన్నట్లుంటుంది పరిస్థితి భారత్‌, పాక్‌ మధ్య పోటీ వస్తే. గతంలో దయాది దేశంతో మ్యాచ్‌ అంటే మనవాళ్లు గెలుస్తారా లేదా అన్న చర్చే ఉండేది కాదు.. ప్రత్యర్థులు గట్టి పోటీ ఇవ్వగలరా లేదా అని చర్చ నడిచేది. మ్యాచ్‌లో మజా వస్తుందా అని ఉత్కంఠతో చూసేవారు. కానీ గతేడాదితో అంచనాలు అన్నీ తారుమారు అయ్యాయి. గతేడాది పొట్టి కప్పు పోరులో పదికి పది వికెట్ల తేడాతో భారత్‌ జట్టును చావు దెబ్బ కొట్టింది పాక్‌ టీమ్‌. గతేడాది దెబ్బకు ఈ ఏడాది ప్రతీకారం తీర్చుకునే విధంగా భారత్‌ ఆడుతుందో లేదో మధ్యహ్నాం 1.30 వరకు వేచి చూడాల్సిందే.

- Advertisement -

సెమీస్‌ రేసులో నిలిచేందుకు పోటీ తీవ్రంగా ఉండనున్న నేపథ్యంలో.. ఆదివారం పాకిస్థాన్‌తో తొలి పోరులో అమీతుమీ తేల్చుకోనుంది రోహిత్‌ సేన. సూపర్‌ ఫామ్‌తో ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌పైనే అందరి దృష్టి ఉంది. ఎటువంటి బౌలింగ్‌నైనా తట్టుకొని, బంతులను బౌండరీలను దాటించే సత్తా ఉన్న బెస్ట్‌ బ్యాటర్‌గా సూర్యకుమార్‌ను చెప్పుకోవచ్చు. ఈతరం డివిలియర్స్‌గా పేరు తెచ్చుకున్న సూర్య.. పాక్‌తో మ్యాచ్‌లో తనపై పెట్టుకున్న అంచనాలను ఏమేర అందుకుంటాడో చూడాలి.

పాక్‌తో మ్యాచ్‌ను భారత్‌ వైపు తిప్పాలనుకుంటే.. ఆ జట్టు కెప్టెన్‌ బాబర్‌, బ్యాట్స్‌మెన్‌ మహ్మద్‌ రిజ్వాన్‌లను వీలైనంత త్వరగా పెవిలియన్‌కు చేర్చాలి. ఈ ఇద్దరే ఓపెనర్లుగా గతేడాది భారత్‌ మ్యాచ్‌లో 150 పైచిలుకు లక్ష్యాన్ని వికెట్‌ పడకుండా సునాయాసంగా ఛేదించేశారు. ఈ రెండేళ్లలో పాక్‌ ఎక్కువ మ్యాచ్‌ల్లో విజయకేతనం ఎగురవేయటానికి వీరిద్దరే కారణం అంటే అతిశయోక్తి కాదు. షాన్‌ మసూద్, హైదర్‌ అలీ, ఇఫ్తికార్‌ అహ్మద్, అసిఫ్‌ అలీ, షాదాబ్, నవాజ్‌ కూడా మంచి బ్యాటర్లే కానీ నిలకడగా ఆడటం లేదు. అయినా వీరిని తేలిగ్గా తీసుకోలేము.. ఎప్పుడు ఎలా విరుచుపడతారో చెప్పలేము.

గాయాల కారణంగా భారత్‌ జట్టులో కీలక ప్లేయర్లు మ్యాచ్‌కు దూరమయ్యారు. ప్రధాన పేసర్‌ బుమ్రా గాయంతో టోర్నీకే దూరమవ్వగా.. ప్రస్తుతం దీపక్‌ చాహర్‌ సైతం అందుబాటులో లేడు. భువనేశ్వర్‌ ఫామ్‌లో లేక ఇబ్బందులు పడుతున్నాడు. ఈ కారణంగానే.. ఏడాదిగా అంతర్జాతీయ టీ20లు ఆడకపోయినా.. షమీని జట్టులోకి తీసుకున్నారు. కానీ, వార్మప్‌ మ్యాచ్‌లో మంచి ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. మరి ఫైనల్‌ మ్యాచ్‌లో షమీని కొనసాగిస్తారా..లేక హర్షల్‌కు అవకాశం ఇస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

పేసర్లకు మెల్‌బోర్న్‌ పిచ్‌ ఎంతో అనుకూలంగా ఉంటుంది. దీని కారణంగా ఫాస్ట్‌ బౌలర్లు రాణించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ బౌరల్‌ షహీన్‌ షా అఫ్రిదితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గతేడాది ప్రపంచ కప్‌లో భారత్‌ ఓటమికి అఫ్రిదే ప్రధాన కారణం. మరి గతేడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకొని భారత్‌ క్రీడాకారులు T20 world cup లో మసులుకుంటారో.. మూస ధోరణిలోనే వెళ్తారో చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...