T20 World Cup | సెమీ ఫైనల్లో పోరాడి ఓడిన భారత్‌

-

T20 World Cup | దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ ఓటమి పాలైంది. ఉత్కంఠ పోరులో టీమిండియా చివరివరకూ పోరాడి ఓడింది. హర్మన్‌ప్రీత్‌ (52), జెమీమా (43), దీప్తిశర్మ (20) రాణించినా ఓటమి తప్పలేదు. అంతకు ముందు బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 172 పరుగులు సాధించింది. బెత్‌మూని (54), మెగ్‌ లన్నింగ్‌ (49), ఆష్లీ గార్డనర్‌ (31) రాణించడంతో ఆస్ట్రేలియా భారీ సోర్కు సాధించింది. ఆ తర్వాత 173 పరుగుల లక్ష్య చేధనలో బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు ఎనిమిది వికెట్ల నష్టానికి 167 పరుగులకే పరిమితమైంది. కీలకమైన మ్యాచ్‌లో ఓపెనర్లు షఫాలీ వర్మ, స్మృతి మంధానా, యాషిక భాటియా తక్కువ సోరుకే వెనుదిరిగారు.

- Advertisement -

T20 World Cup |ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌, జెమీమా రోడ్రిగ్స్‌ ఆదుకున్నారు. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 34 బంతుల్లో 54 పరుగులతో రాణించింది. ఆ తర్వాత హర్మన్‌ప్రీత్‌ రనౌట్‌గా వెనుదిరిగింది. జెమీమా రొడ్రిగ్స్‌ 43 (24) పరుగులు చేసింది. చివరకు దీప్తి శర్మ 17 బంతుల్లో 20 పరుగులతో రాణించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో డార్సీ బ్రౌన్‌ కేవలం 18 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసింది. అలాగే ఆష్లీ గార్డనర్‌కు మరో రెండు వికెట్లు దక్కాయి. మేఘన్‌ స్కాట్‌, జెస్ జోనాస్సెన్‌కు చెరో వికెట్‌ దక్కాయి. సెమీస్‌లో భారత్‌పై గెలిచిన ఆస్ట్రేలియా ఫైనల్‌కు దూసుకెళ్లింది.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...