రోహిత్, కోహ్లీ, పంత్, హార్దిక్ పాండ్య, బుమ్రా లేని జట్టును ఊహించడం కష్టం. కానీ వెస్టిండీస్ తో వన్డే మ్యాచ్ లో వీరు లేకుండానే పోరుకు సిద్ధమై గెలిచింది ధావన్ సేన. వెస్టిండీస్‌తో 3 మ్యాచ్ ల వన్డే సిరీస్ పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్ లో ఇండియా ఘన విజయం సాధించింది.
ఇక ఇప్పుడూ అదే వేదిక.. అదే ప్రత్యర్థి.. మూడు రోజుల వ్యవధిలో వెస్టిండీస్‌తో రెండో వన్డే ఆడేందుకు టీమ్‌ఇండియా సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ పరాజయం పాలైతే సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి విండీస్ తెగించి ఆడొచ్చు. చాలా కాలం తర్వాత మళ్లీ ధావన్, శ్రేయస్, గిల్ ఫామ్ అందుకున్నారు. వీరికి తోడు మిగతా ఆటగాళ్లు రాణిస్తే విజయం ఖాయం. గత మ్యాచ్‌లో బౌలింగ్‌లో అల్జారి జోసెఫ్, మోటీ ఆకట్టుకున్నారు. బ్యాటింగ్‌లో మేయర్స్, బ్రూక్స్, కింగ్ రాణించారు. వీళ్లతో పాటు కెప్టెన్ పూరన్, హోప్ క్రీజులో నిలబడాలని జట్టు కోరుకుంటోంది.
తుది జట్లు (అంచనా)
భారత్: ధావన్, గిల్, శ్రేయస్, సూర్యకుమార్, శాంసన్, దీపక్, అక్షర్, శార్దూల్, సిరాజ్, చాహల్, ప్రసిద్ధ్
వెస్టిండీస్: హోప్, మేయర్స్, బ్రూక్స్, కింగ్, పూరన్, పావెల్, అకీల్, షెఫర్డ్, అల్జారి జోసెఫ్, సీల్స్, మోటీ.