తొలి టీ20 మ్యాచ్ టీమిండియాదే..హార్దిక్, హుడా, ఇషాన్ షో..

0
131

భారత్‌ – ఐర్లాండ్‌ మధ్య 2 టీ20 మ్యాచ్ ల సిరీస్‌ లో ఇండియా శుభారంభం చేసింది. తొలి మ్యాచ్ డబ్లిన్‌ వేదికగా జరగగా..మ్యాచ్ ప్రారంభానికి ముందే వరుణుడు అడ్డుపడ్డాడు. 12 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్‌ 108 పరుగులు చేసింది. ఆ జట్టులో టెక్టార్‌ ఒక్కడే రాణించాడు.

ఇషాన్‌ కిషన్‌ (26; 11 బంతుల్లో 34, 26), హార్దిక్‌ పాండ్య (24; 12 బంతుల్లో 14, 36), దీపక్‌ హుడా (47 నాటౌట్‌; 29 బంతుల్లో చెలరేగడంతో 109 పరుగుల లక్ష్యాన్ని భారత్‌.. 9.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఐర్లాండ్‌ బౌలర్లలో యంగ్‌ (2/18) ఒక్కడే ప్రభావం చూపాడు.

టాస్‌ పడ్డ కాసేపటికే వరుణుడి ప్రతాపం మొదలవడంతో ఆట సాధ్యం కాలేదు. మధ్యలో వర్షం ఆగి ఆట ఆరంభమయ్యేలా కనిపించినా, మళ్లీ వరుణుడు ప్రతాపం చూపించాడు. చివరికి నిర్ణీత సమయం కంటే 2 గంటల 20 నిమిషాలు ఆలస్యంగా మ్యాచ్‌ మొదలైంది. తర్వాత వర్షం అంతరాయం కలిగించలేదు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ తరఫున సత్తా చాటిన యువ పేసర్‌ ఉమ్రాన్‌మాలిక్‌ ఈ మ్యాచ్‌తోనే అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.