2024 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో పాల్గొనే జ‌ట్లు ఇవే..

-

T20 world Cup | వచ్చే ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో ఎన్ని జట్టు పాల్గొంటాయో ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. యూఎస్‌, వెస్టిండీస్ జట్లు టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వ‌నున్నాయి. 2022 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో మొత్తం 16 జ‌ట్లు పోటీ ప‌డ‌గా ఈసారి మాత్రం 20 జ‌ట్లు త‌ల‌ప‌డనున్నాయి.

- Advertisement -

గత టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో టాప్‌-8లో నిలిచిన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భార‌త్‌, పాకిస్తాన్, న్యూజిలాండ్‌, శ్రీలంక, ద‌క్షిణాఫ్రికా, నెద‌ర్లాండ్స్ జ‌ట్ల‌ల‌తో పాటు అతిథ్య హోదాలో యూఎస్‌, వెస్టిండీస్ ల‌తో క‌లిపి మొత్తం 10 జ‌ట్లు నేరుగా అర్హ‌త పొందాయి. తర్వాత టీ20 ర్యాంకింగ్స్‌లో తొమ్మిది, ప‌ది స్థానాల్లో నిలిచిన అఫ్గానిస్థాన్ , బంగ్లాదేశ్‌లు కూడా డైరెక్టుగా అర్హ‌త సాధించాయి. మిగిలిన 8 స్థానాల కోసం రీజియ‌న్ల వారీగా క్వాలిఫ‌యింగ్ పోటీల‌ను నిర్వ‌హించారు.

T20 world Cup | అమెరియ‌న్ క్వాలిఫ‌య‌ర్ విన్న‌ర్‌గా నిలిచిన కెన‌డా, ఏసియా క్వాలిఫ‌య‌ర్ ఫైన‌ల్‌కు చేరుకున్న నేపాల్‌, ఒమ‌న్‌, ఈస్ట్ ఆసియా-ఫ‌సిఫిక్ క్వాలిఫ‌య‌ర్ విజేత ప‌పువా న్యూ గినియా, యూరోపియ‌న్ క్వాలిఫ‌య‌ర్ ఫైన‌ల్‌కు చేరుకున్న ఐర్లాండ్‌, స్కాంట్లాండ్‌, ఆఫ్రికా క్వాలిఫ‌య‌ర్ పైనల్‌కు చేరుకున్న ఉగాండ‌, న‌బీబియాలు టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు అర్హ‌త సాధించాయి,.

మొత్తం 20 జ‌ట్ల‌ను నాలుగు గ్రూపులుగా విభ‌జించ‌నున్నారు. ఒక్కొ గ్రూపులో 5 జ‌ట్లు ఉంటాయి. ప్ర‌తీ గ్రూపులో టాప్‌-2లో నిలిచిన జ‌ట్లు సూప‌ర్‌-8లోకి ప్ర‌వేశిస్తాయి. అక్క‌డ 8 జ‌ట్ల‌ను రెండు గ్రూపులుగా విభ‌జిస్తారు. ప్ర‌తి గ్రూపులో టాప్‌-2లో నిలిచిన జ‌ట్లు సెమీ పైన‌ల్‌కు చేరుకుంటాయి. సెమీ ఫైనల్స్‌లో గెలిచిన జట్లు ఫైనల్‌లో ట్రోపీ కోసం తలపడనున్నాయి.

Read Also: 13 నియోజకవర్గాల్లో గంట ముందుగానే ముగిసిన పోలింగ్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో భారీ ట్విస్ట్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి ముందు జరిగిన కాల్పుల...