చివరి టీ-20 ఇంగ్లాండ్​దే..సూర్య ఒంటరి పోరాటం వృథా

0
119

ఇంగ్లాండ్ తో జరిగిన మూడో టీ 20లో ఇండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. ఇంగ్లాండ్ ఇచ్చిన 216 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేకపోయారు. సూర్యకుమార్ శతకంతో (117) చెలరేగగా మిగతా ఆటగాళ్లు తేలిపోయారు. దీనితో 17 పరుగుల తేడాతో ఇండియా ఓడిపోయింది. మొదటి రెండు మ్యాచుల్లో గెలిసిన టీమిండియా సిరీస్ ను కైవసం చేసుకుంది.