Flash: దిగ్గజ బాక్సర్ సంచలన ఆరోపణలు

0
81

బాక్సర్​ లవ్లీనా సంచలన ఆరోపణలు కలకలం రేపాయి. కామన్వెల్త్​ క్రీడలకు సిద్ధమవుతున్న వేళ ఆమె ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన పలువురు అధికారులు తనను మానసికంగా వేధిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని సోషల్​మీడియాలో పోస్ట్ చేసింది. ఒలింపిక్స్​లో తాను మెడల్​ సాధించడానికి ప్రోత్సాహించిన కోచ్​లను మారుస్తూ తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తన కోచ్​లను తిరిగి నియమించాలని కోరింది.