రెండు పెళ్లిళ్లు చేసుకున్న భారత క్రికెటర్స్​ వీరే..!

0
167

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా ప్రేమ-పెళ్లిళ్లు-విడాకులు ఇలా సాగుతుంది. ఎవరు ఎప్పుడు ఏ కారణంతో విడిపోతారో చెప్పలేం. ఈ మధ్య సామ్-చై ల విడాకులు, షణ్ముఖ్-దీప్తి సునైనా బ్రేకప్ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంటుంది.

అయితే క్రికెట్ లో మాత్రం ఇలాంటి సంఘటనలు జరిగిన సందర్భాలు తక్కువే.  అయితే క్రికెట్ లో ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువగా జరగడం విశేషం. కొందరు భారత క్రికెటర్లు రెండో పెళ్లి చేసుకున్నారు. వారు ఎవరు? ఇప్పుడు తెలుసుకుందాం.

టీమ్ఇండియా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ 1987లో 16 ఏళ్ల నౌరీన్​ను మొదటిసారి వివాహం చేసుకున్నారు. వారికి అసద్, అయాజ్ అనే ఇద్దరు పిల్లలున్నారు. 9సంవత్సరాలు తర్వాత నౌరీన్​- అజారుద్దీన్ విడిపోయారు.
అయితే 1996లో బాలీవుడ్ నటి సంగీత బిజ్లానీతో అజర్ ప్రేమాయణం వల్ల ఆయన మొదటి వివాహా బంధానికి స్వస్తి చెప్పారు. 2010లో సంగీతకు కూడా విడాకులిచ్చారు.

దినేశ్ కార్తీక్, 2007లో 21 ఏళ్ల వయసులో చిన్ననాటి స్నేహితురాలు నికితా వంజరను పెళ్లి చేసుకున్నాడు. 2012లో తమిళనాడు విజయ్ హాజారే ట్రోఫీలో కర్ణాటకతో మ్యాచ్ ఆడుతున్న సమయంలో దినేశ్ కార్తీక్‌కు.. తన భార్యకి-మరో క్రికెటర్​ మురళీ విజయ్‌ మధ్య ఉన్న వివాహేతర సంబంధం గురించి తెలిసింది. దీంతో నిఖితకు విడాకులు ఇచ్చాడు దినేశ్​.

దినేశ్ కార్తీక్.. భారత స్వ్కాష్ ప్లేయర్ దీపికా పల్లికల్‌తో ప్రేమలో పడ్డాడు. ఇద్దరి పరిచయం జిమ్​లో జరిగింది. అది కాస్త ప్రేమగా మారింది. 2015లో దీపిక, దినేశ్​ క్రిస్టియన్, హిందూ సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు.
కపిల్​దేవ్​ తర్వాత టీమ్​ ఇండియా భారత ఫాస్ట్​ బౌలింగ్​ దళానికి నాయకత్వం వహించిన ఆటగాడు జవగళ్​ శ్రీనాథ్​.  మైసూర్ ఎక్స్‌ప్రెస్‌గా పేరుగాంచిన శ్రీనాథ్ 1999లో జ్యోత్స్నను వివాహం చేసుకున్నారు. కొంతకాలానికి ఇద్దరు విడిపోయారు. 2007లో శ్రీనాథ్ జర్నలిస్టు మాధవి పాత్రావళిని రెండో పెళ్లి చేసుకున్నారు.