T20 ప్రపంచకప్ ముంగిట టీమిండియాను వేధిస్తున్న సమస్యలివే..

0
136

ఆసియా కప్ లో టీమిండియా జట్టు తీవ్రంగా నిరాశపరిచింది. ఇక ఆ తరువాత ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ లో రాణించి సిరీస్ కైవసం చేసుకున్నారు. తొలి మ్యాచ్ లో ఓడి సిరీస్ కైవసం చేసుకోవడమంటే మాటలు కాదు. అది టీ20 ప్రపంచకప్ లో బలమైన ప్రత్యర్థి అయిన ఆస్ట్రేలియాను ఓడించడం కఠినమైనదే. అయితే టీ20 సిరీస్ గెలిచాం అని సంబరపడితే అసలుకే మోసం. ఎందుకంటే ఇప్పటికి భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో లోపాలున్నాయి. ప్రపంచకప్ ముంగిట వాటిని సరిచేసుకోకపోతే టీ20 ప్రపంచకప్ ఛాంపియన్ అందని ద్రాక్ష వంటిదే.

బ్యాటింగ్:

రోహిత్ శర్మ, కింగ్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఫామ్ లో ఉండడం ఇండియాకు కొండంత బలం. అయితే రాహుల్ ఇంకా గాడిన పడాల్సి ఉంది. ఇక దినేష్ కార్తీక్ కు, పంత్ కు ఇంకా అవకాశాలు ఇచ్చి చూడాలి. పంత్ ఫామ్ లోకి వస్తే తిరుగుండదు.

బౌలింగ్:

బౌలింగ్ విభాగం ప్రస్తుతం ఇండియాకు కొరకరాని కొయ్యగా మారింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న భువనేశ్వర్, బుమ్రా తుస్సుమనిపించారు. హర్షల్ పటేల్ కూడా అంతగా చేసిందేమి లేదు. షమీ జట్టులో లేకపోవడం పేస్ విభాగ బలహీనతకు కారణం. ముఖ్యంగా డెత్ ఓవర్లలో రాణించే బౌలర్ లేకపోవడంతో మ్యాచ్ లు చేతులు మారుతుంది.

ఇక స్పిన్ విషయానికి వస్తే అక్షర్ పటేల్ అదరగొట్టిన అతనికి చాహల్ సరైన సహకారం ఇవ్వలేకపొతున్నాడు. ఇక సీనియర్ స్పిన్నర్ అశ్విన్ జట్టుకు కలిసోచ్చే అంశం. అయితే జడేజా జట్టుకు దూరమవ్వడం ప్రధాన సమస్యగా మారింది.

ఫీల్డింగ్:

మ్యాచ్ లు  ప్రత్యర్థుల చేతికి వెళ్ళడానికి ప్రధాన కారణం క్యాచ్ లు వదిలేయడం. అవి జట్టు  ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ సరిగా ఉంటేనే మ్యాచ్ గెలవగలం. కాబట్టి అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణిస్తే టీమిండియాకు తిరుగుండదు.