Asia cup: పాక్ తో ఆడే ఇండియా ప్లేయింగ్ XI ఇదే..ఫొటోలు లీక్ చేసిన బీసీసీఐ

0
138

ఆసియా కప్ సమరానికి అంతా సిద్ధం అయింది. రేపు జరగబోయే ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్ పైనే అందరి దృష్టి నెలకొంది. అసలు పాక్ తో మ్యాచ్ లో ప్లేయింగ్ జట్టు సభ్యులు ఎవరవరుంటారో అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఇక తాజాగా టీమ్ ఇండియా నెట్ సెషన్‌కు సంబంధించిన 10 ఫొటోలను బీసీసీఐ షేర్ చేసింది. BCCI తొలి ఫొటోలో KL రాహుల్, రోహిత్ శర్మ కనిపించారు. ఆ తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, భువనేశ్వర్ కుమార్, యుజువేంద్ర చాహల్, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్ ఉన్నారు.

కాగా ఆసియా కప్ భారత జట్టులో దీపక్ హుడా, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్ కూడా ఉన్నారు.

https://www.instagram.com/stories/indiancricketteam/?