Lionel Messi |నీ కోసమే ఎదురుచూస్తున్నాం.. స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్‌ మెస్సీకి హెచ్చరిక

-

ఫీఫా వరల్డ్ కప్ విజేత, ప్రముఖ ఫుట్‌బాల్‌ స్టార్‌ ప్లేయర్‌ మెస్సి(Lionel Messi) భార్యకు చెందిన ఓ సూపర్‌ మార్కెట్‌పై కొందరు గుర్తుతెలియని దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. అనంతరం ‘నీ కోసమే ఎదురుచూస్తున్నాం’ అంటూ మెస్సీకి బెదిరింపు లేఖ రాశారు. అర్జెంటినాలోని మెస్సీ స్వస్థలమైన రోసారియో నగరంలో ఈ ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. అయితే స్థానికంగా గందరగోళ వాతావరణం సృష్టించడానికే కొందరు దుండగులు ఈ చర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మెస్సీపై దాడి చేస్తే ప్రపంచ వ్యాప్తంగా క్షణాల్లో పాపులర్ కావొచ్చన దుశ్చర్యలో భాగమే అని భావిస్తున్నారు. వరల్డ్ కప్ ముగిసిన నాటి నుంచి ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. 2022లో ఏకంగా 22 హత్యలు రోసారియో నగరంలో జరిగాయని పోలీసులు పేర్కొన్నారు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బీఆర్‌ఎస్‌కు షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన వరంగల్ మేయర్

లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి....

ఒకప్పటి ప్రత్యర్థి కోసం మద్దతుగా చంద్రబాబు ప్రచారం

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే దానికి నిదర్శనంగా చంద్రబాబు,...