దులీప్ ట్రోఫీ(Duleep Trophy)లో హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ(Tilak Varma) అదరగొట్టాడు. శతకం బాది ప్రత్యర్థి జట్టు బౌలర్ల దుమ్ము దులిపాడు.193 బంతుల్లో 111 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. ఇండియా-డీతో జరుగుతున్న టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో తిలక్ వర్మ ఒకవైపు రఫ్ఫాడిస్తుంటే మరోవైపు ప్రథమ్ సింగ్ కూడా 189 బంతుల్లో 122 పరుగులు చేసి ప్రత్యర్థులకు సింహ స్వప్నంలా మారారు. కానీ ఇండియా టీమ్ ఏ.. 380 పరుగుల దగ్గర డిక్లేర్ చేశారు. దీంతో ఇండియా-డి టీమ్.. 480 పరుగుల భారీ లక్ష్యంతో రంగంలోకి దిగింది.
Duleep Trophy | మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా డీ టీమ్..1 వికెట్ కోల్పోయి 62 పరుగులు చేసింది. యశ్ దూబె, రికీ భుయ్ ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు. ఈ జట్టు గెలవాలంటే ఇంకా 426 పరుగులు చేయాల్సి ఉంది. కాగా ప్రస్తుతం ఈ మ్యాచ్ దాదాపుగా డ్రాగానే మిగిలే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చివరి రోజు మిగిలిన ఇండియా-డి టీమ్ తొమ్మిది వికెట్లను పడగొడితేనే ఇండియా-ఎ విజయం సాధ్యమవుతోంది.