తెలుగు తేజం, యంగ్ క్రికెటర్ తిలక్ వర్మ(Tilak Varma) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరపున ఆడి అదరగొట్టాడు. ప్రస్తుతం భాతర జట్టుకు ఎంపికైన విషయం తెలిసిందే. తాజాగా.. వెస్టిండీస్ పర్యటనకు బయలుదేరాడు. అక్కడికి వెళ్లే ముందు కుటుంబ సభ్యులతో ఫొటోలు దిగాడు. ఆగష్టు 3వ తేదీ నుంచి భారత్-వెస్టిండీస్ మధ్య ఐదు టీ20 మ్యాచులు జరుగనున్నాయి. తొలి మ్యాచ్ ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా క్రికెట్ మైదానంలో జరుగనుండగా.. తర్వాతి రెండు మ్యాచులు గయానాలోని ప్రావిడెన్స్ మైదానంలో, చివరి రెండు మ్యాచులు ప్లోరిడాలో జరుగనున్నాయి.
Tilak Varma | వెస్టిండీస్‌కు బయలుదేరే ముందు తిలక్ వర్మ ఏం చేశాడంటే?
-