ఆసియా కప్‌లో భాగంగా నేడు టీమ్ఇండియా తన తొలి మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ కరోనా బారిన పడ్డారు. దీనితో జట్టు కొంతమేర ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయినట్లైంది. అయితే తాజాగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాయి క్రికెట్ వర్గాలు.
కరోనా బారిన పడిన టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కొలుకున్నాడని తాజా పరీక్షల్లో అతడికి నెగటివ్ వచ్చినట్లు తెలిసింది. అతడు ఇప్పటికే ఈ ఆసియా కప్ కోసం దుబాయ్ కూడా చేరుకుని జట్టులో కలిశాడని వెల్లడించాయి. ప్రాక్టీస్ సెషన్‌కు కూడా హాజరైనట్లు చెప్పాయి.
మరోవైపు రాహుల్ కరోనా బారిన పడడంతో తాత్కాలిక కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్‌ను ఎంపిక చేశారు. ప్రస్తుతం అతడు జట్టుతోనే ఉన్నాడు. పాక్‌తో మ్యాచ్ ముగిశాక అతడు వెనక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.