నేడే ఆసియా కప్ ఫైనల్..శ్రీలంక-పాకిస్థాన్ అమీతుమీ..గెలుపెవరిది?

0
80

టీమిండియా, పాకిస్థాన్, ఆఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, హాంకాంగ్ ఆసియా కప్ లో పాల్గొన్న జట్లు ఇవి. ఈ లీగ్ కు ముందు హాట్ ఫేవరేట్ ఎవరా అని చూస్తే ముందుగా టీమిండియా ఆ తరువాత పాకిస్థాన్ ఉంది. ఇక పసికూన ఆఫ్ఘన్, హాంకాంగ్ మీద ఆశల్లేవ్. ఇక స్టార్ ప్లేయర్లు లేని శ్రీలంక పని అయిపోయింది అనుకున్నారు. కానీ తీరా చూస్తే సీన్ రివర్స్ అయింది.

ఎన్నో అంచనాలతో టైటిల్ ఫెవరెట్ గా బరిలోకి దిగిన భారత్ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది.  మరో జట్టు అఫ్గాన్ మొదటి  మ్యాచ్ లో సంచలన విజయం సాధించగా..మిగతా మ్యాచ్ ల్లో ఊరించి ఉసూరుమనిపించింది. బంగ్లాదేశ్ పై అరకొర ఆశలు ఉన్న మైదానంలో ఆ జట్టు పూర్తిగా తేలిపోయింది. అసలు అంచనాలు లేకుండా బరిలోకి దిగిన శ్రీలంక అనూహ్య రీతిలో విజయం సాధించి ఫైనల్ వేటలో నిలిచింది. మరో వైపు పాకిస్థాన్ పడి లేస్తూ చివరకు ఆసియా కప్ బరిలో నిలిచింది.

ఇక నేడు ఈ రెండు జట్లు టైటిల్ వేటలోకి దిగబోతున్నాయి. ఇప్పటికే పాకిస్థాన్ పై గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉంది శ్రీలంక. ముఖ్యంగా ఆ జట్టులో కుశాల్‌ మెండిస్‌, నిశాంక, రాజపక్స, శానక జట్టును విజయతీరాలకు చేరుస్తున్నారు. అలా అని పాక్ ను తక్కువ అంచనా వేయలేం. కెప్టెన్ బాబర్, వికెట్ కీపర్ రిజ్వాన్ ఒంటిచేత్తో మ్యాచ్ ను గెలిపించగలరు. అసిఫ్, నవాజ్ రాణిస్తే గెలుపు నల్లేరుమీద నడకే. మరి నేడు జరిగే ఫైనల్ మ్యాచ్ లో గెలుపెవరిదో తెలియాలంటే మ్యాచ్ అయిపోయేవరకు ఆగాల్సిందే..

తుది జట్లు (అంచనా)

పాకిస్థాన్‌: బాబర్‌ (కెప్టెన్‌), రిజ్వాన్‌ (వికెట్‌ కీపర్‌), జమాన్‌, ఇఫ్తికార్‌ అహ్మద్‌, ఖుష్‌దిల్‌ షా, అసిఫ్‌ అలీ, షాదాబ్‌, నవాజ్‌, నసీమ్‌ షా, రవూఫ్‌, హస్నైన్‌.

శ్రీలంక: కుశాల్‌ మెండిస్‌ (వికెట్‌ కీపర్‌), నిశాంక, ధనంజయ డిసిల్వా, గుణతిలక, రాజపక్స, శానక, హసరంగ, చమిక కరుణరత్నె, తీక్షణ, మధుశంక, మధుశాన్‌.