హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానంలో ఐపీఎల్ మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో నగరవాసులకు ఆర్టీసీ యాజమాన్యం శుభవార్త చెప్పింది. మ్యాచ్ కోసం ఆర్టీసీ అదనపు సేవలను నడపనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్‌లో వేర్వేరు ప్రాంతాల నుంచి ఉప్పల్ మార్గంలో మొత్తం 60 ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసింది. ఇవి హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియానికి వెళ్తాయి. మ్యాచ్ అనంతరం తిరుగు పయననమవుతాయి. క్రికెట్ అభిమానులు సొంత వాహనాల్లో వెళ్లి ట్రాఫిక్, పార్కింగ్ సమస్యతో ఇబ్బంది పడకుండా ఆర్టీసీ బస్సుల్లో వెళ్లి మ్యాచ్‌ను వీక్షించాలని అధికారులు సూచించారు. అదేవిధంగా నాగోల్ – అమీర్‌పేట మెట్రో మార్గంలో కూడా అదనంగా రైళ్లు నడుపుతామని ఆ సంస్థ ప్రకటించింది. రాత్రి 12.30 గంటలకు చివరి రైలు నడవనుందని. కాగా, ఇప్పటికే పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.