మహేంద్రసింగ్ ధోనీ(Dhoni) ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. మిస్టర్ కూల్‌గా కూడా అభిమానులు పిలుచుకుంటారు. ధోని స్టేడియంలోకి అడుగు పెడుతున్నాంటేనే మైదానమంతా అభిమానుల కేరింతలతో దద్దరిల్లాల్సిందే. ఇప్పటికి కూడా ధోనీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు కదా రోజురోజుకు పెరుగుతూనే ఉంది. అయితే కొన్ని రోజులుగా ధోనీని అన్క్యాప్డ్ ప్లేయర్ మారే అవకాశం ఉందని, పాత నిబంధనను మళ్ళీ అమలు చేయడమే ఇందుకు కారణమని చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే అదే జరిగితే వచ్చే ఏడాది ఐపీఎల్లో ధోనీ ఆడకపోవచ్చని, ఐపీఎల్‌కు కూడా తన రిటైర్మెంట్ ప్రకటించొచ్చని కూడా మరోవైపు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఎంఎస్ ధోనీ.. బ్యాడ్మింటన్ కోర్టులోకి అడుగెపెట్టిన వీడియో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో కొందరితో కలిసి ధోని బ్యాడ్మింటన్ ఆడుతూ కనిపిస్తున్నాడు. క్రికెట్లోనే కాదు బ్యాడ్మింటన్‌లో కూడా తనదే పైచేయి అనిపించుకున్నాడు. బలమైన స్మాషెస్ చేస్తూ కనిపించాడు. ఈ వీడియోపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో ధోని తన ఫిట్‌నెస్‌పై ఇంత ఫోకస్ పెడుతున్నాడంటే రానున్న ఐపీఎల్లో అన్ని టీమ్స్‌కు ఇక చుక్కలే అంటూ కొందరు అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ధోనీ(Dhoni) పేరుకే క్రికెటర్.. మిగిలిన అన్ని గేమ్స్‌లో కూడా మంచి ఎక్స్పీరియన్స్, స్కిల్స్ ఉన్నాయి అంటూ ఇంకొందరు రాసుకొచ్చారు.