Virat Kohli |గుజరాత్‌లోని నరేంద్ర మోడీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరిగుతోన్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అదరగొట్టాడు. దాదాపు మూడున్నరేళ్ల విరామం తర్వాత టెస్టుల్లో సెంచరీ నమోదు చేసి.. అభిమానుల్లో ఆనందాన్ని నింపాడు. మొత్తానికి 364 బంతుల్లో 186 స్కోరు చేసి మరోసారి సత్తా చాటాడు. అయితే.. డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని త్రుటిలో చేజార్చుకున్నాడు కింగ్ కోహ్లీ. అయినా.. శభాష్ అంటూ ఫ్యాన్స్ కోహ్లీని ప్రశంసలతో ముంచెత్తారు. కాగా, ఆసీస్‌తో జరుగుతున్న చివరి టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరును నమోదు చేసింది. 178.5 ఓవర్లలో 571 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.
మూడేళ్ల తర్వాత కోహ్లీ సూపర్ సెంచరీ.. టీమిండియా భారీ స్కోరు
-