భారత్ – ఇంగ్లాండ్(India Vs England) మధ్య ఈనెల 25న తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం లో రెండు జట్లు తలపడనున్నాయి. ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ హైదరాబాద్ లో, రెండవ మ్యాచ్ విశాఖపట్నంలో జరగనుంది. అయితే ఈ రెండు మ్యాచ్ లకు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరం అయ్యాడు. ఇది టీమిండియాకి భారీ ఎదురుదెబ్బ అని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు.
INDIA Vs England | విరాట్ కోహ్లీ రెండు టెస్టుల నుంచి వైదొలగడం అందరినీ నిరాశపరిచింది. అయితే, వ్యక్తిగత కారణాలతోనే విరాట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ(BCCI) పేర్కొంది. గురువారం నుంచి టెస్టు మ్యాచులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఆటగాళ్ళు హైదరాబాద్ కి చేరుకున్నారు. విరాట్ కూడా తొలి మ్యాచ్ ఆడడం కోసం ఆదివారం నాడే హైదరాబాద్ చేరుకున్నాడు. కానీ, “ఇంగ్లాండ్ తో జరిగే తొలి రెండు టెస్టుల్లో ఆడలేనని విరాట్ బీసీసీఐ కి రిక్వెస్ట్ చేశాడు. ఇదే విషయాన్ని కెప్టెన్ రోహిత్, టీమ్ మేనేజ్‌మెంట్, సెలెక్టర్లతో కూడా మాట్లాడాడు. దేశం తరఫున ఆడడం గర్వకారణమే అయినప్పటికీ కుటుంబంతో గడపాల్సిన కచ్చితమైన పరిస్థితి ఏర్పడిందని తెలిపాడు. బీసీసీఐ కూడా విరాట్ నిర్ణయాన్ని గౌరవిస్తూ అతడికి మద్దతుగా నిలుస్తోంది. అలాగే మీడియా, అభిమానులు కూడా ఈ క్లిష్ట సమయంలో అతడి ప్రైవసీకి భంగం కలిగించవద్దని కోరుతున్నాం. అలాగే ఇంగ్లండ్‌తో సిరీస్ విజయం కోసం జట్టుకు అండగా నిలవాలి” అని బోర్డు కార్యదర్శి జైషా కోరారు.