ఐపీఎల్ 2023లో వరుస ఓటములతో చతికిలపడిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. జట్టు స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్(Washington Sundar) గాయంతో ఐపీఎల్ 2023 మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ట్విటర్ వేదికగా ప్రకటించింది. వాషింగ్టన్ సుందర్ తొడ కండరాల గాయంతో భాదపడుతున్నాడని సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) వెల్లడించింది. సుందర్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తుందని సన్ రైజర్స్ పేర్కొంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ ఆల్ రౌండ్ పర్ఫామెన్స్‌తో అదరగొట్టాడు. మూడు వికెట్లు తీసుకోవడంతో పాటు.. 24 పరుగులు చేశాడు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు 7 మ్యాచులు ఆడిన వాషింగ్టన్ సుందర్(Washington Sundar).. తొలి 6 మ్యాచ్‌ల్లో కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సుందర్ దూరమవ్వడం కోలుకోలేని దెబ్బ కానుంది. వాషింగ్టన్ సుందర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.8.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.
Read Also: తనను అలా చూడం ఇబ్బందిగా అనిపించింది: అలియా భట్
Follow us on: Google News, Koo, Twitter