Resingnation: వెస్టిండీస్‌ ప్రధాన కోచ్‌ రాజీనామా

-

Resingnation: “టీ20 మెగా టోర్నీలో విండీస్‌ ఫలితం నన్ను తీవ్రంగా నిరాశపరిచింది. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నా. ప్రధాన కోచ్‌గా రాజీనామా చేస్తున్నా” అంటూ విండీస్‌ ప్రధాన కోచ్‌ ఫిల్‌ సిమ్మన్స్‌ తన పదవికి రాజీనామా ప్రకటించారు. ఈ సందర్భంగా ఫిల్‌ సిమ్మన్స్‌ మాట్లాడుతూ, టీ20 మెగా టోర్నీలో వెస్టిండీస్‌ తీవ్రంగా నిరాశపరిచిందని బాధను వ్యక్తం చేశారు. తన హృదయం కాకావికలం అయ్యిందనీ, అందుకే బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కొన్ని రోజులుగా ఆలోచించి.. ఇప్పుడు బయటకు చెప్తున్నట్లు ప్రకటించారు.

- Advertisement -

ఆసీస్‌తో టెస్టు సిరీస్‌ ముగిశాక ప్రధాన కోచ్‌గా నిష్క్రమించనున్నట్లు (Resingnation) ప్రకటించారు. కాగా గతంలో రెండు సార్లు T20 ప్రపంచ కప్‌ విజేతగా నిలిచిన వెస్టిండీస్‌, ఈఏడాది ఘోరంగా విఫలం అయ్యింది. క్వాలిఫయర్‌ రౌండ్‌లోనే ఇంటి ముఖం పట్టిన విషయం తెలిసిందే. మెుదట ప్రపంచ కప్‌ కోసం జట్టు ఎంపిక నుంచే ఆ జట్టులో లుకలుకలు ప్రారంభం కాగా, సీనియర్లు, T20 స్పెషలిస్టులు ఆండ్రూ రస్సెల్‌, కీరన్‌ పొలార్డ్‌, సునిల్‌ నరైన్‌ వంటి కీలక ఆటగాళ్లు లేకుండానే విండీస్‌ బరిలోకి దిగింది. జట్టు కూర్పుపై అప్పట్లో పెద్దగా చర్చ జరగగా, క్వాలిఫయర్‌ మ్యాచ్‌లోనే మెగా టోర్నీ నుంచి నిష్క్రమించటంతో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం ప్రపంచ కప్‌ అనంతరం ఆస్ట్రేలియాతో వెస్టిండీస్‌ టెస్టు సిరీస్‌ ఉంది. ఆ తరువాతే కోచ్‌ బాధ్యతల నుంచి సిమ్మన్స్‌ వైదొలుగనున్నట్లు ప్రకటించారు.

Read also: మూడు రాజధానులు సీఎం జగన్‌‌ విజన్‌

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...