Suyash Sharma |ఐపీఎల్ ద్వారా ఎంతో మంది ఆటగాళ్లు ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు. తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని భారత జట్టులోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం టీమిండియాలో కీలక ఆటగాళ్లుగా కొనసాగుతున్న చాలా మంది ఆటగాళ్లు ఐపీఎల్ నుంచి వచ్చినవారే. తాజా ఐపీఎల్ లో కొంతమంది యంగ్ ప్లేయర్స్ కూడా అదరగొడుతున్నారు.
ఈ క్రమంలోనే గురువారం బెంగళూరుతో జరిగిన మ్యాచులో తన స్పిన్ మాయాజాలంతో అదరగొట్టిన 19ఏళ్ల యువ స్పిన్నర్ సుయార్ శర్మ గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మాజీ ఆటగాళ్లు మిస్టరీ స్పిన్నర్ అంటూ సుయాష్ ప్రతిభను కొనియాడుతున్నారు. ఢిల్లీకి చెందిన సుయాష్ ను మినీ వేలంలో కేకేఆర్ జట్టు రూ.20లక్షలకు దక్కించుకుంది. బెంగళూరుతో జరిగిన మ్యాచులో వెంకటేశ్ అయ్యర్ స్థానంలో ఇంపాక్ట్ ప్టేయర్ గా బరిలోకి దిగిన సుయాష్ 4ఓవర్లలో 30పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు.
ఎవరీ సుయాష్ శర్మ?
19 ఏళ్ల సుయాష్ శర్మ(Suyash Sharma) ఢిల్లీలో పుట్టి పెరిగాడు. పిల్లలతో గల్లీ క్రికెట్, కుర్రాళ్లతో టోర్నీలు ఆడుతూ ఉండేవాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సుయాష్ ఇంతవరకు ఒక్క దేశవాళీ మ్యాచ్ కూడా ఆడలేదు. గల్లీ క్రికెట్ ఆడుతూనే నేరు ఐపీఎల్ లో తన తొలి మ్యాచ్ ఆడేశాడు. గల్లీ క్రికెట్ ఆడుతుండగా కేకేఆర్ టాలెంట్ హంట్ టీం సుయాష్ బౌలింగ్ యాక్షన్ ని గమనించింది. దీంతో అతని టాలెంట్ కు మెచ్చిన కేకేఆర్ యాజమాన్యం కేవలం రూ.20లక్షలకు వేలంలో దక్కించుకుంది. అలా మనోడు ఐపీఎల్ లోకి అడుగుపెట్టాడు.
Read Also: మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై వీహెచ్ సెన్సేషనల్ కామెంట్స్
Follow us on: Google News, Koo, Twitter