ఆదివారం జరిగిన ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy) ప్రెజెంటేషన్ వేడుకకు పాకిస్తాన్ ప్రతినిధులు ఎవరూ హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. వసీం అక్రమ్, వకార్ యూనస్ వంటి పాకిస్తాన్ మాజీ క్రికెట్ దిగ్గజాలు పాక్ క్రికెట్ బోర్డు (PCB) పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ గందరగోళం నుంచి బయటపడేందుకు పీసీబీ ఫేస్ సేవింగ్ చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
Champions Trophy | నివేదికల ప్రకారం, ఛాంపియన్‌షిప్ కు అధికారిక హోస్ట్ గా ఉన్న పీసీబీ, టోర్నమెంట్ డైరెక్టర్ సుమైర్ అహ్మద్ ను పోస్ట్-ఫైనల్ ప్రెజెంటేషన్ వేడుకలో ఎందుకు చేర్చలేదో అంతర్జాతీయ క్రీడ పాలక సంస్థ ఐసిసి నుండి అధికారికంగా వివరణ కోరింది. పీసీబీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కూడా అయిన సుమైర్, టోర్నమెంట్ డైరెక్టర్ హోదాలో, ఫైనల్ లో పాకిస్తాన్ ప్రతినిధిగా దుబాయ్‌లో ఫైనల్ కోసం ఉన్నట్లు తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ అధికారిక హోస్ట్. ఆసక్తికరంగా PCB చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ హాజరు కావాల్సి ఉండగా, పాకిస్తాన్ లో కొన్ని ఉన్నత స్థాయి భద్రతా సమావేశాలకు హాజరు కావడానికి తన పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చింది.