ఈ ఐపీఎల్‌లో యంగ్ ప్లేయర్ యశస్వి జైశ్వాల్(Yashasvi Jaiswal) తన ఆటతో అదరగొడుతున్నాడు. పరుగుల వరద పారిస్తూ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు విజయాలు అందిస్తున్నాడు. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరుగుతోన్న మ్యాచ్‌లో సరికొత్త రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్‌లో 27పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఐపీఎల్‌లో 34 ఇన్నింగ్స్‌ల్లోనే వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా నిలిచాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న రెండో పిన్న వయస్కుడిగా జైశ్వాల్(21 ఏళ్ల 130 రోజులు) రికార్డు నెలకొల్పాడు. జైశ్వాల్ కంటే ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్(20 ఏళ్ల 218 రోజులు) 35 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు చేసి తొలి స్థానం దక్కించుకున్నాడు.
Read Also: వాటిని తగ్గిస్తే.. గుండెపోటు రాకుండా జాగ్రత్త పడినట్లే!
Follow us on: Google News, Koo, Twitter