Telangana Budget 2024 |రాష్ట్ర బడ్జెట్ ప్రసంగంలో భాగంగా తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పాలించిన పదేళ్లలో రాష్ట్ర అప్పులు వామనావతారంలో పెరిగి ప్రజలను ‘బలి’ చక్రవర్తిని తొక్కినట్లు తొక్కేస్తున్నాయంటూ ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన సమయంలో ఉన్న అప్పులతో పోలిస్తే ప్రస్తుతం ఉన్న అప్పులు పది రెట్లు అధికంగా ఉన్నాయని తెలిపారాయన.
Telangana Budget 2024 | ‘‘చిలికి చిలికి గాలి వాన అయినట్లు రాష్ట్ర ఆవిర్భావ సమయానికి ఉన్న 75,577 కోట్ల రూపాయల అప్పు గత ఏడాది డిసెంబర్ నాటికి వామనావతారంలా పెరిగి 6,71,757 కోట్ల రూపాయలకు చేరింది. అంటే గత పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పు దాదాపు పదిరెట్లు పెరిగింది. తదనుగుణంగా రాష్ట్ర అభివృద్ది జరగలేదన్నది అక్షర సత్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ రాష్ట్రానికి రావలసిన నీళ్ళు, నిధులు, నియామకాలు దక్కడం లేదన్న కారణంగా ఉద్యమించిన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు ఎంతవరకు నెరవేరాయి? అన్న ప్రశ్నకు మనమంతా కలసి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది’’ అని భట్టి విక్రమార్క వివరించారు.