కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఎమ్‌ఐఎమ్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) సంచలన వ్యాఖ్యలు చేశారు. మైనార్టీల పట్ల కేంద్రం వివక్ష చూపుతోందన్నారు. బీజేపీ మతం పేరుతో ఎన్ కౌంటర్లు చేస్తోందని ఆరోపించారు. రాజస్థాన్‌కు చెందిన జునైద్, నసీర్లను చంపిన వారిని బీజేపీ ఎందుకు ఎన్ కౌంటర్ చేయడం లేదని ప్రశ్నించారు.
బుల్లెట్లతో న్యాయం చేస్తామని నిర్ణయించినప్పుడు ఈ కోర్టులు దేనికని ప్రశ్నించారు. న్యాయస్థానాలను మూసి వేయండన్నారు. మైనార్టీ విద్యార్థులకు స్కాలర్ షిప్‌ల విషయంలో కేంద్రం ఆంక్షలు విధిస్తోందన్నారు. చట్టపరమైన పరిపాలనను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. మజ్లిస్ సేవకుడిగా అసదుద్దీన్ ఒవైసీ ఉండేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటానన్నారు.
Read Also: కేసీఆర్ దెబ్బ అంటే అట్లా ఉంటది: KTR
Follow us on: Google News, Koo, Twitter