Telangana Formation Day |తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే గురువారం నూతన సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్(CM KCR) కీలక సమావేశం నిర్వహించారు. సందర్భంగా దశాబ్ది ఉత్సవాలకు ప్రభుత్వం రూ.105 కోట్లు విడుదల చేసింది. 21 రోజులపాటు ఘనంగా నిర్వహించాలని అందుకు సంబంధించిన ఖర్చులకు కలెక్టర్లకు నిధులు విడుదల చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడారు. స్వరాష్ట్రంగా ఏర్పడ్డ అనతికాలంలోనే తెలంగాణ దేశం గర్వించేలా అభివృద్ధి చెందిందని అన్నారు. పదేళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతి ప్రస్థానాన్ని.. అమరుల త్యాగాలు గుర్తు చేసుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఘనకీర్తిని చాటిచెప్పేలా.. తెలంగాణ రాష్ట్ర అవతరణ(Telangana Formation Day) దశాబ్ది ఉత్సవాలు, పండుగ వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
Read Also:
1. గ్రూప్-1,2 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
2. నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవానికి గైర్హాజరు, హాజరయ్యే పార్టీలు ఏవంటే?
Follow us on: Google News, Koo, Twitter