Telangana Elections | తెలంగాణ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. బుధవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియగా 608 మంది పోటీ నుంచి తప్పుకొన్నారు. దీంతో బరిలో మొత్తం 2,290 మంది అభ్యర్థులు నిలిచినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అత్యధికంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో 48 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. అత్యల్పంగా బాన్సువాడ, నారాయణపేట నియోజకవర్గాల్లో ఏడుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారని పేర్కొంది.
Telangana Elections | మునుగోడులో 39, పాలేరు నియోజకవర్గంలో 37, కోదాడలో 34, నాంపల్లిలో 34, ఖమ్మంలో 32, నల్గొండలో 31, కొత్తగూడెంలో 30 మంది, సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో 10 మంది నిలబడ్డారు. ఇక సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో అత్యధికంగా 70 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో ఆ నియోజకవర్గంలో 44 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఇక కేసీఆర్ పోటీ చేస్తున్న మరో నియోజకవర్గమైన కామారెడ్డిలో 39 మంది అభ్యర్థులు తుది పోరులో ఉన్నారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నవంబర్ 28న ప్రచారం ముగియనుండగా.. నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇక డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడికానున్నాయి.