Accident: వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

-

3 peoples died in Warngal Accident: వరంగల్‌ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు వదిలారు. వర్ధన్నపేట పట్టణం డీసీ తండా వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టటంతో ఘటన జరగగా.. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు గాయపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఏపీలోని ఒంగోలు నుంచి వరంగల్‌లోని పెరుకావాడకు వెళ్తుండగా ప్రమాదం సంభవించినట్లు పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

ప్రమాద సమయంలో కారులో మెుత్తం తొమ్మిది మంది ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు పేర్కొన్నారు. డ్రైవర్‌ నిద్ర మత్తు ప్రమాదం జరిగిందా.. లేదా దట్టంగా అలముకున్న పొగమంచు కారణమా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Pawan Kalyan | చిన్న కొడుకుకి అగ్నిప్రమాదం… సింగపూర్ వెళ్లనున్న పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్...

LEAP Model | ఏపీ విద్యా వ్యవస్థలో మార్పులు… కొత్తగా LEAP మోడల్

LEAP Model | ఏపీ సర్కార్ ఈ నెలలో ఎడ్యుకేషన్ మోడల్...