తెలంగాణలో(Telangana) ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. పోటీలో ఎవరు నిల్చోని కారణంగా నామినేషన్లు దాఖలు చేసిన ఐదుగురు అభ్యర్థులను విజేతలను ప్రకటించారు రిటర్నింగ్ అధికారి. అద్దంకి దాయకర్(Addanki Dayakar), విజయశాంతి(Vijayashanthi), దాసోజు శ్రావణ్(Dasoju Sravan), శంకర్ నాయక్(Kethavath Shankar Naik), నెల్లికంటి సత్యం(Nellikanti Satyam) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆరుగులు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కానీ, వారి నామినేషన్ పత్రాలు నిబంధనల మేరకు లేకపోవడంతో వాటిని రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం సాయంత్రంతో ముగిసింది. దీంతో ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.