Hyderabad | పేలిన ఇంకో ఈవీ బైక్.. 9బైకులు దగ్ధం

-

హైదరాబాద్(Hyderabad) రామాంతపూర్ పరిధిలో వివేక్ నగర్‌లోని ఓ ఇంట్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈవీ బైక్ బ్యాటరీ ఒక్కసారిగా పేలడంతో మంటలు ఇల్లంతా వ్యాపించాయని స్థానికులు అంటున్నారు. ఈ మంటల తాకిడికి పార్కింగ్‌లో ఉన్న ఎనిమిది బైకులు దగ్ధమయ్యాయి. ఈ మేరకు సమాచారం అందిన వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా ఈ ఘటనపై పోలీసులు దృష్టి సారించి దర్యాప్తు ప్రారంభించారు. మంటలకు అసలు కారణం ఏంటనేది తెలుసుకోవడం కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఈ ప్రమాదం యాధృచ్చికంగా జరిగిందా లేకుండా ఎవరైనా కావాలని చేసిందా అన్న కోణంలో కూడా దర్యాప్తును కొనసాగిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Hyderabad | ఇదిలా ఉంటే ఈరోజు జీడిమెట్ల(Jeedimetla) పారిశ్రామిక వాడలో పాలిథిన్ సంచులు తయారు చేసే SSV ఫ్యాబ్ పరిశ్రమలో కూడా అగ్ని ప్రమాదం జరిగింది. కింది అంతస్తులో మొత్తం కూడా ప్లాస్టిక్‌కు సంబంధించి ముడిసరుకు ఉండటంతో ప్రమాద తీవ్రత అధికంగా ఉంది. ఈ ప్రమాదం మంగళవారం జరిగినప్పటికీ మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. నాలుగు ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో భవనం పూర్తిగా దగ్ధమై కూలిపోయింది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దాంతో పాటుగా మంటలు పక్కన ఉన్న ఇతర కంపెనీలకు వ్యాపించే ప్రమాదం ఉందని గ్రహించిన సిబ్బంది.. అలా జరగకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Read Also: రోజుకో అరటి పండు తింటే ఏమవుతుందో తెలుసా..!
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

White Hair | తెల్ల జుట్టుకు తేలికైన చిట్కాలు..

తెల్ల జుట్టు(White Hair) అనేది ఇప్పుడు చాలా మందిని ఇబ్బంది పెడుతున్న...

Baby John | అదరగొడుతున్న ‘బేబీ జాన్’ ట్రైలర్..

మహానటి కీర్తి సురేష్(Keerthy Suresh).. బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘బేబీ...