Falaknuma Train Accident | ఫలక్ నుమా రైలు ప్రమాదం.. వేల ప్రాణాలు కాపాడిన ‘ఆ ఒక్కడు’

-

Falaknuma Train Accident | యాదాద్రి భువనగిరి జిల్లాలో శుక్రవారం రైలు ప్రమాదం జరిగింది. పగిడిపల్లి-బొమ్మాయిపల్లి స్టేషన్ల మధ్య ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లో మంటలు వచ్చాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల రెండు బోగీల్లో మంటలు చెలరేగాయి. అధికారులు రైలును నిలిపివేసి ప్రయాణికులను దింపేశారు. దీంతో ప్రాణనష్టం తప్పింది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

- Advertisement -

ప్రమాద ఘటనలో ఏడు బోగీలు దగ్ధమైనట్లు SCR GM అరుణ్ కుమార్ తెలిపారు. ఇందులో మూడు పూర్తిగా, నాలుగు పాక్షికంగా దహనం అయ్యాయన్నారు. మొత్తం 18 బోగీల్లో 7 ఘటనా స్థలిలో ఉంచి మిగతా 11 కోచ్ లను సికింద్రాబాద్ తరలిస్తున్నామని చెప్పారు. దగ్ధమైన బోగీల్లోని ప్రయాణికులను బస్సులో గమ్యస్థానానికి పంపే ఏర్పాట్లు చేశామన్నారు.

ఒక్కరి అప్రమత్తత.. వందల ప్రాణాలు నిలిపింది:

ఫలక్ నుమా రైలు అగ్నిప్రమాద(Falaknuma Train Accident) ఘటనలో ఒక్క వ్యక్తి అప్రమత్తత వందల ప్రాణాలు కాపాడింది. మంటలు వస్తున్నాయని గమనించిన వెంటనే ఓ వ్యక్తి చైన్ లాగారని ప్రయాణికులు తెలిపారు. చైన్ లాగడంతో రైలును ఆపిన లోకో పైలట్ మంటలను చూసి అప్రమత్తమై.. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. అటు ఇదే సమయంలో ఇతర బోగీలకు మంటలు వ్యాపించకుండా కోచ్ ల మధ్య లింక్ తీసేశారు. ఆ వ్యక్తి తమ పాలిట దేవుడిలా చైన్ లాగాడని ప్రయాణికులు చెబుతున్నారు.

కాగా ఫలక్ నుమా రైలు ప్రమాద ఘటనలో ఎవరూ గాయపడలేదని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రయాణికుల సంబంధీకులు ఆందోళన చెందవద్దని కోరింది. అటు క్షేమ సమాచారం తెలిపేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అధికారులు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ప్రయాణికుల సంబంధీకులు 040- 27786140/170, 040- 27801111 నంబర్ల ద్వారా సమాచారం తెలుసుకోవచ్చన్నారు.

Read Also:
1. ఉభయ జిల్లాల రైతులకు ఆందోళన కలిగిస్తున్న గోదావరి.. కారణమేంటి?

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ram Mohan Naidu | ఆ ఒక్కటి గుర్తు పెట్టుకోండి.. ఎంపీ రామ్మోహన్ నాయుడి వార్నింగ్

తమ ప్రభుత్వం ఎవరిపై కక్షపూరితంగా వ్యవహరించడం లేదని ఎంపీ రామ్మోహన్ నాయుడు(Ram...

న్యూ ఇయర్ వేడుకలు.. గీత దాటితే తాట తీస్తామంటోన్న పోలీసులు

New Year Celebrations | న్యూ ఇయర్ వేడుకలకి తెలుగు రాష్ట్రాలు...