19 మంది డ్రగ్​ ఇన్స్​స్పెక్టర్లకు అడిషనల్ బాధ్యతలు

-

Additional responsibilities for 19 drug inspectors In Telangana: తెలంగాణ వ్యాప్తంగా కొద్దిరోజుల క్రితం 10 మంది అసిస్టెంట్​ డైరెక్టర్లు, 51 మంది డ్రగ్ ఇన్స్​స్పెక్టర్లను (డీఐ లను) బదిలీ చేసింది తెలంగాణ సర్కార్. ఈ నేపథ్యంలో 19 చోట్ల డ్రగ్​ఇన్స్​స్టెక్టర్​ పోస్టుల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న 19 మంది అధికారులకు అడిషనల్​ చార్జ్​ ఇస్తూ హెల్త్ సెక్రటరీ రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సూర్యాపేట్​లో డ్రగ్​ఇన్స్​స్పెక్టర్​ గా పనిచేస్తున్న జీ. సురేందర్​ కు మిర్యాలగూడ డీఐ, జిన్నారంలో డీఐ గా ఉన్న జి. శ్రీకాంత్​ కు బొల్లారం–అమీన్ పూర్​కు, బాలాపూర్ డీఐ వి. రవికుమార్​కు మహేశ్వరం, శేరిలింగంపల్లి డీఐ ఏ.శైలజ రాణిని రాజేంద్రనగర్​కు, గండిమైసమ్మ లో డీఐగా ఉన్న ఎం.హేమలతకు మేడ్చల్​, బాచుపల్లి డీఐ ఎం. శ్రీ బింధు ప్రశాంత్​నగర్​కు, కుత్బుల్లాపూర్​డీఐ ఈ. తిరుపతి కు గాజుల రామారం, కాప్రా డీఐ టి. శివతేజకు బాలనగర్​, హబ్సిగూడ డీఐ ఇందిరా ప్రియదర్శినికి మేడిపల్లి, మెహదీపట్నం డీఐ పీ. సంతోష్​ కు చార్మినార్​ , ఖైరతాబాద్​ డీఐ వివేకానందకు యూసఫ్ గూడ, మలక్​పేట్​ డీఐ జీ. అనిల్​కు ముషీరాబాద్​, సికింద్రాబాద్​ డీఐ బీ. గోవింద్​ సింగ్​కు బేగంపేట్​, మహబూబ్​ నగర్​ డీఐ షేక్​ రబియాను నారాయణపేట్, జడ్జర్ల డీఐ ఎండీ. రఫి షేక్​ ను గద్వాల, వనపర్తి డీఐ ఏ. రష్మీ కు నాగర్​ కర్నూల్​, మంచిర్యాల డీఐ టి. చందనకు పెద్దపల్లి, ఆదిలాబాద్​ డీఐ ఏ. శ్రీతల నిర్మల్​, సిద్ధిపేట్​ అసిస్టెంట్​ డైరెక్టర్​ ఏ. రాజుకు మెదక్​ డ్రగ్ ఇన్స్​స్పెక్టర్​గా పూర్తి స్థాయిలో అదనపు బాధ్యతలు ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ అధికారులు ప్రస్తుతం పనిచేస్తున్న పోస్టులతో పాటు కొత్తగా ఇచ్చిన బాధ్యతలనూ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పూర్తి స్థాయిలో పర్యవేక్షించాల్సి ఉంటుందని రిజ్వీ సూచించారు.

Read Also: బరువు తగ్గాలి అనుకుంటే పెసలు ఇలా వండుకుని తినేయండి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...