Soyam Bapu Rao | ఆ నిధులను సొంత అవసరాలకు వాడుకున్నా.. తప్పేంటి?: BJP MP

-

ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు(Soyam Bapu Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఎంపీ నిధులను సొంత అవసరాలకు వాడుకున్నానని అలా వాడుకుంటే తప్పేంటి? అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై విపక్ష, సొంత పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు కానీ నా నిధులు నా వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటే తప్పేంటి? అంటూ ప్రశ్నించారు. నా ఇంటి నిర్మాణం కోసం, నా కుమారుడు పెళ్లి కోసం నిధులు వాడుకున్నానని వివరణ ఇచ్చారు. దీనిపై విపక్షాలు విమర్శలు చేస్తుంటే తాను చేసిన దాంట్లో తాప్పేముంది అని అడిగారు. ఎంతోమంది ఎంపీలు తమ నిధుల్ని ఇష్టానుసారంగా వాడేసుకున్నారు. అలాగే నేను కూడా వాడుకున్నాను. కానీ తాను వాడిన ప్రతీ రూపాయి తిరిగి లబ్ధిదారులకు ఇచ్చేస్తున్నాను అని చెప్పుకొచ్చారు. ఎంపీ లాడ్స్ నిధులు(MP Lands Funds) సొంతానికి వాడుకున్న విషయంపై వచ్చే విమర్శలను ఏమాత్రం పట్టించుకోనంటూ కొట్టిపారేశారు. ఎంపీ లాడ్స్ నిధులకు సంబంధించిన చెక్కులను పంచుతూ ఈ వ్యాఖ్యలు చేశారు సోయం బాపూరావు(Soyam Bapu Rao).

- Advertisement -
Read Also:
1. రూ.10 కోసం కక్కుర్తిపడి పోలీసులకు చిక్కిన గజదొంగ
2. సీఎం జగన్ ప్రజాసంపదను కొల్లగొడుతున్నారు: విష్ణువర్ధన్ రెడ్డి

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...

Ponnam Prabhakar | ఆటో డ్రైవర్ల కష్టాలకు బీఆర్ఎస్సే కారణం: పొన్నం ప్రభాకర్

ఆటో డ్రైవర్ల(Auto Drivers) సమస్యలపై బీఆర్ఎస్ నేతలు ఈరోజు అసెంబ్లీలో నిరసన...