హైదరాబాద్‌లో ‘అగ్నివీర్’ రిక్రూట్‌మెంట్(Agniveer Recruitment) ర్యాలీకి సన్నాహలు మొదలయ్యాయి. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో డిసెంబర్ 8 నుంచి 16 వరకు ఈ నియామక ర్యాలీ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్/స్టోర్ కీపర్ ట్రెడ్స్‌కు కనీసం పదో తరగతి విద్యార్హత ఉండాలని ఆర్మీ రిక్రూట్‌మెంట్ బోర్డ్ అధికారులు వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి నుంచి మహిళా మిలటరీ పోలీస్ అభ్యర్థులకు 12 ఫిబ్రవరి 2024 నోటిఫికేషన్ ప్రకారం ర్యాలీ జరిగే ప్రదేశానికి సంబంధిత దస్త్రాలు తీసుకుని రావాలని అధికారులు సూచించారు. ఈ రిక్రూట్‌ప్రక్రియ పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఉంటుందని వెల్లడించారు.
Agniveer Recruitment | హైదరాబాద్‌లో ‘అగ్నివీర్’ రిక్రూట్‌మెంట్.. ఎప్పటి నుంచంటే..
-