AICC: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి హైకమాండ్ నోటీసులు జారీ చేసింది. తన తమ్ముడు, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఓటు వేయాలంటూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పిన ఆడియో వైరల్‌గా మారి చర్చకు దారితీస్తున్న విషయం తెలిసిందే.. ఈ ఆడియో లీక్పై ఏఐసీసీ (AICC) క్రమశిక్షణ కమిటీ వివరణ కోరింది. 10 రోజుల్లో సమాధానం ఇవ్వాలని పేర్కొంది.
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణిక్యం ఠాగూర్ ఫిర్యాదుతో వెంకట్రెడ్డికి ఏఐసీసీ నోటీసులు ఇచ్చింది. అయితే.. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉన్న ఆయన ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లి మెల్‌బోర్న్‌లో తనను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన అభిమానులతో మాట్లాడుతూ, ‘‘మునుగోడులో కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. నేను వెళ్లి ఎన్నికల ప్రచారం చేసినా పదివేల ఓట్లు వస్తాయి.. తప్ప గెలవబోము’’ అని మాట్లాడారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. కాగా.. వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. ఏఐసీసీ ఆడియో వీడియోల విషయన్ని సీరియస్‌గా తీసుకుని.. ఆయనపై సోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది.
Read also: Pothina Mahesh :అందులో వైసీపీ నేతలు దిట్ట